Bandi Sanjay : అసలు నువ్వు కరీంనగర్ ప్రజలకు ఒరగబెట్టిందేమిటి..?

by Aamani |   ( Updated:2023-11-17 13:33:25.0  )
Bandi Sanjay : అసలు నువ్వు  కరీంనగర్ ప్రజలకు ఒరగబెట్టిందేమిటి..?
X

దిశ,కరీంనగర్: నేను అవినీతిపరుడినట. నా దగ్గర డబ్బు సంచులున్నయట. అందుకే అధ్యక్ష పదవి నుంచి నన్ను తీసేశారట… నేనేమైనా ఆయన లెక్క మంత్రినా? అధికారంలో ఉన్నామా? గంగుల లెక్క గుట్టలు మాయం చేశానా? భూములు కబ్జా చేసి కమీషన్లు దొబ్బిననా? నేనెట్లా అవినీతి చేస్తా?’’ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుడికి, జాతీయ ప్రధాన కార్యదర్శికి తేడా తెలియని మూర్ఖుడు గంగుల అని ధ్వజమెత్తారు. ‘‘నా పార్టీ నాకు హెలికాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం చేయాలని పంపుతోంది. అవినీతికి పాల్పడితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు. హెలికాప్టర్ ఇవ్వరు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వరు.. మోదీ అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెస్తడని తెల్వదా?’’ అని నిలదీశారు. తెలంగాణలో అత్యంత అవినీతిపరుడు గంగుల కమలాకరేనని అన్నారు. అవినీతిలో తెలంగాణలో కరీంనగర్ టాప్ అని రాష్ట్ర ప్రభుత్వ నిఘా నివేదికలే చెబుతున్నయన్నారు. ’’అవినీతికి పాల్పడుతున్నందుకే గంగులను కరీంనగర్ కే పరిమితం చేసిండు. బిఫాం ఇవ్వకుండా సతాయించిండు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లోని చామన్ పల్లి గ్రామం లో బండి సంజయ్ కుమార్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు.


Next Story