పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

by Shiva |
పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
X

దిశ, బెజ్జంకి : పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలని.. ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నయని మానకోండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లక్ష్మీపూర్, బేగంపేట, వడ్లూర్ గ్రామాల్లోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కలను అందజేసి అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు.

పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని ఎంతో మంది పేద కుటుంబాలకు పెళ్లి భారం తగ్గిందని, ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు రాకూడదని అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా వడ్లూర్ పరుశురాములు, చింతకింది పరుశురాములు ఎమ్మెల్యే రసమయి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కవిత, పాకాల మహిపాల్ రెడ్డి, భోనగిరి శ్రీనివాస్, మేకల శ్రీకాంత్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story