- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
దిశ, తిమ్మాపూర్ : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడమే బీ.ఆర్. ఎస్. పార్టీ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన కిన్నెర వేణు అనే బీ.ఆర్.ఎస్. పార్టీ కార్యకర్త ఇటీవల ప్రమాద వశాత్తు మృతి చెందగా ఆదివారం ఎల్ఎండి లోని క్యాంపు కార్యాలయంలో అతని తల్లి సుజాతకు రూ.2 లక్షల బీ.ఆర్.ఎస్. పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యులుగా భావించిన సీఎం కేసీఆర్ ప్రమాద బీమా కింద ప్రతి కార్యకర్తకు కు ఇన్సూరెన్స్ చేయించడం జరిగిందన్నారు. ప్రమాదంలో కుటుంబ వ్యక్తిని కోల్పోయినప్పుడు పార్టీ తన వంతుగా రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందించడం అనేది ఈ దేశ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ప్రవేశపెట్టిన చరిత్ర కేసీఆర్ కే దక్కిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, శేఖర్ గౌడ్, రెడ్డి తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.