- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పంచాయతీ ప్లాంట్‌ల మూత.. ప్రైవేటుప్లాంట్‌ల మోత
దిశ, రామడుగు : రామడుగు మండలంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ లు మూతపడి ప్రైవేటు వాటర్ ప్లాంట్ల మోత మోగడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు స్వచ్ఛమైన నీరు తాగించాలనే భావంతో గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి కేవలం ఐదు రూపాయలకే ధర నిర్ణయించి అందుబాటులో పెట్టారు.అయినప్పటికి వినియోగంలో లేకపోవడంతో ఆయా గ్రామాల్లో ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసినటువంటి వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళక తప్పట్లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఒక్కో డబ్బాకు రూ.15 చొప్పున వసూలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక అధికారుల పాలన ప్రైవేట్ ప్లాంట్లపై దృష్టి సారించి అందులో మినరల్ శాతం ఎంత ఉంది అనే దానిపై పరీక్షలు జరిపి ప్రజలకు నాణ్యమైన వాటర్ అందే విధంగా, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను తెరిచే విధంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.