అభివృద్ధిని మరిచిన అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు

by Sumithra |
అభివృద్ధిని మరిచిన అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు
X

దిశ, చిగురుమామిడి : అధికారులు గ్రామంలో అభివృద్ధిని మరిచారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మనపల్లిలో మంగళవారం పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ప్రస్తుతం గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్న తరుణంలో గ్రామ ప్రత్యేక అధికారి వినయ్ సాయి ఎందుకు గ్రామ సభకు హాజరు కావడం లేదని పలువురు ప్రశ్నించారు. ప్రత్యేక అధికారి లేకుండా తమ సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. 11వ వార్డు లాలయపల్లి, 9వ వార్డు రాములపల్లి రోడ్డు పల్లె మీద నీటి సమస్య పరిష్కారం కోసం వేసవి కాలంలో వేస్తానన్న రెండు బోర్లు ఎందుకు వేయలేదని, నిర్మాణ దశలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎప్పుడు నిర్మిస్తారని గ్రామస్తులు మామిడి రాజు, మాచమల్ల బుజ్జన్న, కిషోర్ ప్రశ్నించారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆరోగ్య కేంద్రం నిర్మాణం ఆలస్యం అవుతుందని తెలిపారు. అలాగే గ్రామంలో గ్రంథాలయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని డీఎస్పీ జిల్లా నాయకుడు తాల్ల నరేష్ మహారాజ్ ప్రశ్నించారు. ఇటీవల కురిసిన గాలి వానలకు ధ్వంసమైన స్మశాన వాటిక రేకులను ఎప్పుడు బాగు చేస్తారని, మొదటి వార్డ్ లో నీటి సమస్య అధికంగా ఉందని బోర్ కు కనీసం చేతి పంపు బిగించాలని కోరారు. ప్రత్యేక అధికారుల పాలనలో పనులు సక్రమంగా జరగడం లేదంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed