- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జేపీఎస్ ల విషయంలో ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించింది : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల ప్రతినిధి : తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని దీక్షలు చేపట్టిన జూనియర్ పంచాయతీ సెక్రటరీల నిరసన దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేయడం ఉద్యోగుల ప్రాథమిక హక్కు అన్నారు.
రెగ్యులరైజ్ చేయకుండా ప్రభుత్వమే నిబంధనలు ఉల్లంఘించి కార్యదర్శులను విధులకు రాకపోతే తొలగిస్తామనడం సమంజసం కాదన్నారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టులు జిల్లా స్థాయి పోస్టులుగా గుర్తించారు. నిబంధనలకు అనుగుణంగా సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. పంచాయతీ కార్యదర్శుల కష్టంతో రాష్ట్రానికి 79 అవార్డులు తీసుకువచ్చారని అలాంటి వారి సమస్యలను తీర్చకపోవడం సభకు కాదన్నారు.
ప్రొబేషనరీ కాలం పూర్తి చేసుకున్న జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయడంతో పాటు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారిని జూనియర్ పంచాయతీ సెక్రటరీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేసేంతవరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన అండగా ఉంటామని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అద్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, ఎంసీటీసీ భుమారెడ్డి, గోపి రావు,కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుండా మధు పాల్గొన్నారు.