గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ పై చర్య తీసుకోండి

by Sridhar Babu |
గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ పై చర్య తీసుకోండి
X

దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి సింగిల్ విండో భవన నిర్మాణానికి స్థలం కొనుగోలు పేరిట అక్రమాలకు పాల్పడ్డ చైర్మన్ జూపల్లి సందీప్ రావుపై బీసీ యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ తంగళ్లపల్లి రాజ్ కుమార్ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంత్రిని శనివారం హైదరాబాద్ లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజకుమార్ మాట్లాడుతూ విండో చైర్మన్ రూ.39 లక్షలకు భూమి కొనుగోలు చేసి రూ.44 లక్షలకు కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించి రూ.5 లక్షలు కాజేశాడని ఆరోపించారు.

అంతేకాకుండా భూమి విక్రయించిన బీసీ వర్గానికి చెందిన సందెవేని శ్రీనివాస్ ను బెదిరించి మరో రూ.2 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి రూ.5 లక్షల విండో సొమ్మును రికవరీ చేయించాలని, బెదిరించి తీసుకున్న రూ.2 లక్షలను భూమి విక్రయించిన శ్రీనివాస్ కు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుపై స్పందించిన మంత్రి విచారణకు ఆదేశించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రాజ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story