మైనర్లతో వాటర్ బాటిళ్ల సప్లై... తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఘటన

by Shiva |
మైనర్లతో వాటర్ బాటిళ్ల సప్లై... తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఘటన
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : మైనర్లతో పనులు చేయించుకోవడం నేరమని చట్టాలు చెబుతున్నాయి. అంతే కాకుండా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఆపరేషన్ స్మైల్ వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతూ బాల కార్మికులను గుర్తించి బడిలో చేర్పిస్తున్నారు. అయితే ఇంత చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించడం లేదు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో మైనర్లతో వాటర్ బాటిళ్లను సప్లై చేయించడం వివాదాస్పదంగా మారింది. సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్న కార్యక్రమాల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మైనర్లకు రోజువారీ కూలి లెక్కన మాట్లాడి పనికి తీసుకువచ్చినట్లుగా కార్యక్రమానికి వచ్చిన వారు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story