- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు : జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ రామ్
దిశ, జగిత్యాల ప్రతినిధి : టూ వీలర్లకు కంపెనీ ఫిట్టెడ్ సైలెన్సర్లు కాకుండా సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేసే ఎక్స్ ట్రా ఫిట్టెడ్ సైలెన్సర్లు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ రామ్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ భాస్కర్ ఆదేశాల మేరకు టౌన్ సీఐ రామచందర్ రావు ఆధ్వర్యంలో గత కొద్దిరోజుల నుంచి చేపట్టిన స్పెషల్ డ్రైవ్ తనిఖీలలో సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్న 35 బైక్ లను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.
పట్టుబడిన వాహనాలకు బిగించిన ఎక్స్ ట్రా ఫిట్టెడ్ సైలెన్సర్లు తొలగించి వాటి స్థానంలో కంపెనీ సూచించిన సైలెన్సర్లు బిగించడంతో పాటు ఆయా వాహనదారులకు జరిమానా విధించినట్లు వివరాలు వెల్లడించారు. పట్టణంలో సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్న వాహనాల రిజిస్ట్రేషన్ రద్దుకు సిఫారసు చేస్తామని కాబట్టి వాహనదారులు స్వచ్ఛందంగా పొల్యూషన్ క్రియేట్ చేసే సైలెన్సర్లను తొలగించుకొని పోలీసు వారికి సహకరించాలని సూచించారు.