- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌కు అతను త్వరలో షాకివ్వబోతున్నాడా..?
దిశ, సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి రూటు మార్చారు. నిన్న మొన్నటి వరకు కరీంనగర్ కాంగ్రెస్ అధినాయకత్వంతో విభేదాల కారణంగా దూరంగా ఉన్న కేకే మళ్లీ తిరిగి సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటనలు షురు చేశారు. కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న కేకే నియోజకవర్గానికి, కాంగ్రెస్ సమావేశాలకు గత కొంతకాలంగా దూరంగా ఉండటంతో పార్టీ మారబోతున్నాడా..? లేకా కేకే వ్యూహమేంటనేది ఎవరికి అంతుచిక్కలేదు. మొత్తానికి మహేందర్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గం బాటపట్టాడు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలంలో పర్యటించి కాంగ్రెస్ క్యాడర్ ను కలిసి ఛాయ్ పే చర్చ చేశారు. సెస్ ఎన్నికలపై ముచ్చటించారు. మండలాల వారీగా సెస్ బరిలో ఎవరిని పెడితే బాగుంటుంది? ఏం చేస్తే కాంగ్రెస్ గెలుపు బాటలో ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. హైదరాబాద్ లో కోర్టు ప్రాక్టీస్ లో కాస్తా బిజీగా ఉన్నందు వల్లే నియోజకవర్గ పర్యటనలో కాస్తా జాప్యం జరిగిందని కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తూ పార్టీ మారబోతుండని అసంహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దన్నారు. తాను ఏం చేసినా కార్యకర్తల అభిమతానికి అనుగుణంగానే చేస్తానని తెలిపారు. సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్యానల్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గంలో పాదయాత్ర...
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి పాదయాత్రను నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి అధికార పార్టీతో తాడోపేడో తేల్చుకునేందుకు కేకే రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ హామీల విస్మరణ, తప్పిదాలు.. సిరిసిల్ల నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రజల ముందు ఉంచేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సూచనప్రాయంగా కాంగ్రెస్ శ్రేణులతో చర్చించారు. నియోజకవర్గంలో ప్రతి పల్లెను కలిసేలా పాదయాత్ర ఉండబోతున్నట్లు కేకే తన అభిమానుల వద్ద పేర్కొన్నారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏది ఏమైనా కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో కేటీఆర్ ను ఢీకొట్టేందుకు పాదయాత్రతో ముందుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సిరిసిల్లలో పాదయాత్ర నిర్వహించారు. ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి త్వరలోనే నిర్వహించబోయే పాదయాత్ర ఏ మేర ప్రజలపై ప్రభావం పడనుంది. కేకే తన ఎంజెండాను త్వరలో ప్రకటిస్తానని పేర్కొనడంతో రాజకీయ చర్చ ప్రారంభమైంది.
Also Read....