- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగిత్యాల టీఆర్ఎస్ నాయకుల తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ... కేసీఆర్ ఆగ్రహం?
దిశ, పెగడపల్లి: సరిగ్గా 24 గంటల క్రితం ఆయన్ని స్మరించుకోని గొంతుకలు లేవు. ఆయన అందించిన రాజ్యాంగం స్ఫూర్తితోనే తామీ స్థాయికి చేరామంటూ కొనియాడినవారు లేకపోలేదు. కానీ, ఈరోజు ఆయన విగ్రహం చుట్టూ పార్టీ జెండాలు కట్టి విస్మయపరచారు టీఆర్ఎస్ నాయకులు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులర్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లాలో కూడా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం తామేమీ తీసిపోమని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల దండలు వేసి దండాలు పెట్టి ఆయన సేవలను కొనియాడారు.
ఇదంతా నిన్నటి వరకేనన్నట్టుగా వ్యవహరించిన అధికార పార్టీ నాయకులు ఒక్క రోజులోనే తమ వైఖరిని చేతల్లో చూపించారు. తమ నేతే ముఖ్యం.. తమ పార్టీ జెండాలే అంతకన్నా ముఖ్యం అన్నా రీతిలో వ్యవహరించిన టీఆర్ఎస్ నాయకులు సరికొత్త చర్చకు లేవనెత్తారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహం విషయంలోనూ టీఆర్ఎస్ నాయకులు ఇలా వ్యవరించడం ఏంటంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు పలువురు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ టీఆర్ఎస్ పార్టీ జెండాలతో నింపేశారు. నిన్న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నాయకులు అందరూ పూల మాలలు వేయగా ఆ పూల దండలు వాడిపోకముందే పార్టీ జెండాలతో టీఆర్ఎస్ నాయకులు నింపేశారు. భారత రాజ్యాంగ నిర్మాతకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. పార్టీ జెండాలను విగ్రహం చుట్టూ కట్టడం ఎంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read more: