- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SP Akhil Mahajan : సెల్ ఫోన్ల రికవరీలో సిరిసిల్ల నెం1..
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : మిస్సయిన సెల్ ఫోన్లలో 84% రికవరీ చేసి కమిషనరేట్ మినహా రాష్ట్రంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో ఉందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇటీవల దొంగలించబడ్డ, మిస్సయిన 78 ఫోన్లను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా సంబంధిత బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఫోను పోతే టెన్షన్ పడొద్దని, సీఈఐఆర్ పోర్టర్ లో లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే అతి త్వరలో ఫోన్ ఎక్కడుందో కనిపెట్టవచ్చన్నారు. 14 నెలల్లో మిస్సయిన సుమారు కోటి రూపాయల విలువ గల 1200 ఫోన్లు రికవరీ చేసి, 1019 ఫోన్లు సంబంధిత బాధితులకు అందించినట్లు ఆయన తెలిపారు. సీఈఐఆర్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడానికి కృషి చేసిన ఐటీ కోర్ ఎస్సై కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజా తిరుమలేష్ లను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు. టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
సీఈఐఆర్ లో నమోదు ఇలా..
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సెల్ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి www.ceir.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాప్ట్/ స్టోలెన్ అనే లింక్ పై క్లిక్ చేసి, సెల్ ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ఏరోజు, ఎక్కడ పోయిందో రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.