రక్త హీనతతోనే అనారోగ్యం: అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

by Shiva |
రక్త హీనతతోనే అనారోగ్యం: అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
X

దిశ, హుజూరాబాద్: పోషక ఆహారం లోపంతో పిల్లలు, గర్భిణులు రక్త హీనతతో అనారోగ్యానికి గురవుతున్నారని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. మంగళవారం పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయ మండపంలో పోషక అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషక లోపం ఉన్న వారిని గుర్తించి పౌష్టికాహారం అందించాలని సూచించారు. పిల్లల ఎదుగుదల, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు.

అనంతరం మండల పరిధిలోని తుమ్మనపల్లి గ్రామంలో నిర్వహించిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. శిబిరంలో అందుతున్న సేవలను గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో దోభీఘాట్ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, ఆర్దీవో హరిసింగ్, డిప్యూటీ డీఎంహెచ్ వో చందు, తహసీల్దార్ కోమల్ రెడ్డి, సీడీపీవో భాగ్యలక్ష్మి, మునిసిపల్ కమిషనర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed