దొడ్డి దారిన దో నెంబర్ దందా..

by Sumithra |
దొడ్డి దారిన దో నెంబర్ దందా..
X

దిశ, కోరుట్ల : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఇసుక అక్రమ రవాణా మాఫియాలు దొడ్డి దారిని ఎంచుకొని మరీ అక్రమ ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. పట్టణంలోని 12వ వార్డులో రెండు ఇసుక ట్రాక్టర్ ఓవర్ లోడుతో మరీ ఇసుకను తరలిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారీతిలో ఇసుక తరలిస్తూ ఒక్కో ట్రాక్టర్ ఇసుక ట్రిప్ దాదాపు 6 వేల నుండి 10వేల వరకు వసులు చేస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యనే మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి ఇసుక బకాసురుల పై ఉక్కుపాదం మోపి అక్రమ ఇసుక తరలిస్తున్న లారీల పై కేసు నమోదు చేసిన ఘటనలు ఉన్నయి. అయినా కొందరు ఇసుక మాఫియా దారులు మాత్రం పట్టణంలోకి దొడ్డి దారిలో ఇరుకుగా ఇన్న దారి ఎంచుకుని అగ్రికల్చర్ పేరుతో రిజిస్ట్రేషన్ అయిన ట్రాక్టర్లతో అందులో ఓవర్ లోడ్ తో మరీ అక్రమ ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయనికి భారీగా గండి కొడుతూ భూగర్భ జలవనరులకు ఆటంకం గలిగిస్తున్న అక్రమ ఇసుక మాఫియాపై మరింత లోతుగా నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed