'రూడా' కు రూట్ మ్యాప్.. కసరత్తులో వేగం పెంచిన బల్దియా అధికారులు..

by Aamani |
రూడా కు రూట్ మ్యాప్.. కసరత్తులో వేగం పెంచిన బల్దియా అధికారులు..
X

దిశ,గోదావరిఖని: రామగుండం అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ (రూడా ) కు రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇటీవల రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రూడా ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు రూడా రూట్ మ్యాప్ లో తల మునకల్ అవుతున్నారు. దీనిలో భాగంగా రామగుండం కార్పొరేషన్ కు 360 డిగ్రీలో దాదాపు 35 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను, జనాభాను రూడా పరిధిలోకి చేర్చేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.

అటు పెద్దపల్లి మున్సిపాలిటీ, ఇటు మంథని మున్సిపాలిటీ పరిధిలోని చాలా గ్రామాలు రుడా పరిధిలోకి వెళ్లనున్నాయి. అయితే రూడాలోకి ఆయా గ్రామాల విలీనం జరుగుతుందని విషయం బయటకు రాకుండా అధికారులు తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఎందుకంటే రూడాలో విలీనం కు గ్రామీణ ప్రాంతాల నుంచి సుముఖత కంటే విముఖతే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండటంతో అధికారులు అత్యంత పకడ్బందీగా ప్రతిపాదనలు తయారు చేసుకున్నారు. వరంగల్, కరీంనగర్ తరహాలో రాబోయే రోజుల్లో రామగుండం కార్పొరేషన్ అభివృద్ధిలో రూప రేఖలు అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ దీపావళి పండుగ నాటికి ఈ ప్రతిపాదనలు పూర్తి చేసే జిల్లా కలెక్టర్ కు సమర్పించేందుకు అధికారులు చర్యలను మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రామగుండం కార్పొరేషన్ జనాభా రెండు లక్షల 50 వేల వరకు ఉంటుంది. కార్పొరేషన్ లో ఉన్న 50 డివిజన్లను అదనంగా మరో 10 వరకు పెంచేందుకు కూడా కసరత్తులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా రుణ నిర్మాణంతో రామగుండం జనాభా అంతకు మూడింతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వివిధ భారీ పరిశ్రమలు విస్తరించి ఉండటం తో ఆటో కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి భవిష్యత్తులో రామగుండం రూపురేఖలు మార్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ప్రత్యేక దృష్టి సారించి రుడా తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed