నాణ్యమైన భోజనం అందించాలి

by Sridhar Babu |
నాణ్యమైన భోజనం అందించాలి
X

దిశ, కథలాపూర్ : నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు. కథలాపూర్ మండలం కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తరగతి గదులను, వంటశాలను, స్టోర్ రూంను, కంప్యూటరు ల్యాబ్ తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న శిక్షణ తరగతులను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ ప్రొవిజన్స్ ని పరిశీలించారు. నాణ్యమైన భోజనం, బియ్యం ముడి సరుకులు నాణ్యమైనవి అందించాలని అధికారులను కోరారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం గురించి తగు సలహాలు, సూచనలు చేశారు.

కాగా భోజనం రోజూ వారి మెను ప్రకారం అందించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. అనిత గ్రౌండ్ ఆవరణలో చెరువు మత్తడి నుండి వర్షాకాలం ఎక్కువగా నీరు వచ్చి గ్రౌండ్లో స్టోరేజ్ అవుతుందని, పిల్లలకు ఇబ్బందిగా ఉందని, అలాగే హాస్టల్ కి వెళ్లే దారిలో ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే కావల్సిన మరమ్మతులతో పాటుగా ఐ మ్యాక్స్ లైట్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, టాయిలెట్లను శానిటేషన్ చేయించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఆదేశించారు. పాఠశాల నిర్వహణలో కానీ , భోజన ఏర్పాట్లలో కానీ ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ జివాకర్ రెడ్డి, తహసీల్దార్ వినోద్, డీఆర్డీఓ మధన్ మోహన్, ఎంపీడీఓ శంకర్, ఆర్ఐ నగేష్, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed