- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రజావాణికి వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్ అనురాగ్ జయంతి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల అలాగే హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో నిర్వహించిన ప్రజావాణికి ఇప్పటిదాకా ఎన్ని దరఖాస్తులు వచ్చాయో, ఎన్ని పెండింగ్ ఉన్నాయో వాటికి సరైన కారణాలు తెలుపుతూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో సుప్రీం, హైకోర్టు ల కేసులు ఎన్ని పెండింగ్ ఉన్నాయో, వాటి వివరాలు ఇవ్వాలని, ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు. కాగా ప్రజావాణికి మొత్తం 29 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, జడ్పీ సీఈవో ఉమారాణి, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ వీర బుచ్చయ్య, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.