- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వికలాంగురాలికి అందని ద్రాక్షగా పెన్షన్
ఏళ్లుగా తిరుగుతున్నా.. స్పందించని అధికారులు
ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు
దిశ, పెద్దపల్లి : అర్హులకు పెన్షన్ నేటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. వందశాతం వికలాంగురాలిగా సర్టిఫికెట్ ఉన్న తనకు పెన్షన్ ఇవ్వడం లేదంటూ పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన విలాసాగరపు శైలజ తల్లితండ్రులు బాధితురాలితో కలిసి ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. శైలజకు 2016 లోనే వంతశాతం వికలాంగురాలిగా ప్రభుత్వం సర్టిఫికెట్ జారీ చేసింది. అయినా తమ కూతరికి పెన్షన్ రావడం లేదంటూ తల్లిదండ్రులు వాపోయారు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎంత తిరిగినా.. లాభం లేకుండా పోయిందని తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వాళ్ల తరపున సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్ అధికారులకు సమస్యను వివరించారు. వందల ఎకరాలు భూములున్న భూస్వాములకు రైతుబంధు ఇవ్వగలిగిన ప్రభుత్వం అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వలేకపోవడం హాస్యాస్పదమని అన్నారు. బాధితురాలికి వారంలోగా పెన్షన్ మంజూరు చేయాలని లేని పక్షంలో కలెక్టరేట్ ఎదుట బాధితురాలితో కలిసి నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.