- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓటమి భయంతోనే బీజేపీ కార్యకర్తల పై కేసులు..ఎంపీ అరవింద్..
దిశ, జగిత్యాల ప్రతినిధి : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అంటే వణుకు పుడుతోంది అని అందుకే కక్ష సాధింపుతో బీజేపీ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ని ఖండిస్తూ బీజేపీ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ నాయకుడు పన్నాల తిరుపతి రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి పంపగా అతడి కుటుంబ సభ్యులను ఆదివారం ఎంపీ అరవింద్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీఆర్ఎస్ కి దడ పుడుతోంది అని అందుకే కార్యకర్తల మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
2018కి ముందు ఉత్తర తెలంగాణ పసుపు రైతుల పక్షాన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర మంత్రులను కలుస్తూ ముందుకు సాగిన నాయకుడు తిరుపతి రెడ్డి అని అంతే కాకుండా గతంలో ముత్యంపెట్ షుగర్ ఫ్యాక్టరీ పై పోరాటం చేసిన రైతులపై కేసులు పెట్టి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ కవిత లు బీజేపీ నాయకులపై కేసులు పెట్టమని పోలీసుల మీద ఒత్తిడి పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదని రాబోయే ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ సీటు బీజేపీ ఖాతాలో పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్ కుటుంబానికి పరామర్శ..
శనివారం గుండెపోటులో మరణించిన 33 వార్డు కౌన్సిలర్ రజని భర్త బీఆర్ఎస్ నాయకుడు బండారి నరేందర్ కుటుంబాన్ని ఎంపీ అరవింద్ పరామర్శించారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్, నాయకులు నవీన్ రావు, పడాల తిరుపతి, మధన్ మోహన్ తదితరులు ఉన్నారు.