మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Shiva |
మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

పంచాయతీ కార్మికుల డిమాండ్లను మండలిలో ప్రస్తావిస్తా..

దిశ, జగిత్యాల ప్రతినిధి : గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరుతూ జిల్లాలోని కారోబార్లు సోమవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ సిబ్బంది సేవలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. కార్మికుల జీతాలు పెంచడం పాటు ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, అదేవిధంగా దశాబ్ధాలుగా పని చేస్తున్న కారోబార్లను బిల్ కలెక్టర్లుగా, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా ప్రమోట్ చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. పంచాయతీ కార్మికుల సమస్యలను శాసనమండలిలో లేవనెత్తి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed