MLA Laxman Kumar : మీకు ఏ సమస్య ఉన్నా నన్ను నేరుగా కలవండి..

by Sumithra |
MLA Laxman Kumar : మీకు ఏ సమస్య ఉన్నా నన్ను నేరుగా కలవండి..
X

దిశ, పెగడపల్లి : ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో వెనక్కి తగ్గేది లేదని ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మండలంలోని బతికేపల్లి గ్రామంలో సీఆర్ఆర్ నిధులు నలభై లక్షల వ్యయంతో నిర్మించే రోడ్డుకి శంఖుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటి సుమారు యాభై లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులు, పదహారు లక్షల కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ గెలిచిన, ఓడిన ప్రజల్లో ఉంటూ ప్రజల తరపున పోరాటం చేసినందుకు నా మీద నమ్మకంతో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మండలంలో గల సాగు, తాగు నీరు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మండల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని తెలిపారు.

ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా తనను కలవచ్చు అని నియోజకవర్గ కేంద్రంలో ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న సీఎం సహాయ నిధి చెక్కులు గడువు పూర్తి అయినప్పటికీ పేదలకు సాయం అందాలని ప్రత్యేక చొరవ తీసుకుని సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేయించాను అని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం పేదలకు అందెందుకు నా శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేసిన తర్వాతనే ప్రజలను ఓట్లు అడిగేందుకు వస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహశీల్దార్ రాజశేఖర్, ఆర్ ఐ శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, మహిళ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి శోభ రాణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒరుగలి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్లు తోట మల్లేశం, మద్దెల సుధీర్, నాయకులు సంధి మల్లారెడ్డి, తాటిపర్తి ప్రభాకర్ రెడ్డి, పూసల తిరుపతి, కడారి తిరుపతి, అమిరిశెట్టి మల్లారెడ్డి, ది కొండ మహేందర్, అనిల్ గౌడ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story