MLA Sanjay Kumar : రైతులను ఆదుకోవడమే లక్ష్యం

by Aamani |
MLA Sanjay Kumar : రైతులను ఆదుకోవడమే లక్ష్యం
X

దిశ,జగిత్యాల టౌన్: రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం అంబారి పెట్ రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు తో పాటు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా 31 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మాత్రమే అమలు చేస్తుందని, జగిత్యాల అర్బన్ మండలం లో 399 కుటుంబాలకు ఈరోజు రైతు రుణ విముక్తి అయిందని అన్నారు. రైతుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటారని, త్వరలో రైతు భరోసా నిధులు కూడా రైతుల ఖాతాల్లో జమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో వినీల, ఎంపీడీవో విజయలక్ష్మి, సలీం, నాగరాజు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story