- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాలల ఆత్మగౌరవం కోసం పోరాటం
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : తాను ఎవరికీ వ్యతిరేకం కాదని, మాలల ఆత్మగౌరవం కోసమే హైదారాబాద్ కేంద్రంగా సింహగర్జన నిర్వహించనున్నట్టు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలో లహరి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు రాగుల రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన మాల, మాల ఉపకులాల ఆత్మ గౌరవ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన వర్గీకరణ తీర్పు కుల వివక్ష మాత్రమేనని, అన్ని రాజకీయ పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారని, అందరం ఏకతాటి పైకి వచ్చి హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడానని, ప్రస్తుతం ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవ్వరు సహకరించకపోయినా మాల జాతి కోసం ముందుండి కొట్లాడుతానని తెలిపారు. మాలలు ఐక్యంగా ఉండాలని, మాల జాతి ఆత్మగౌరవం కోసం తాను పోరాడడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. డిసెంబర్ 1న హైదరాబాద్లోని పెరియర్ గ్రౌండ్ లో నిర్వహించబోతున్న మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, రిటైర్డ్ డీఎస్పీ దామోదర నర్సయ్య, ప్రజా మిత్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వేణుగోపాల్ తో పాటు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.