దూసుకుపోతున్న లారీలు.. బెంబేలెత్తుతున్న స్థానికులు..

by Sumithra |
దూసుకుపోతున్న లారీలు.. బెంబేలెత్తుతున్న స్థానికులు..
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలో గత 20 రోజుల నుంచి ప్రమాదం తర్వాత ప్రమాదం జరుగుతూనే ఉన్నాయి. అధిక వేగంతో దూసుకుపోతున్న గ్రానైట్ లారీలు, మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్లు మృత్యుషకటాలుగా మారుతున్నాయి. వీటి ద్వారా ఈ మధ్యకాలంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. లారీలను అదుపు చేసే వారు లేరా పరిమితికి మించిన ఓవర్ లోడ్ తో అత్యధిక వేగంతో వెళ్తున్న ఈ లారీల పట్ల రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఏంటి? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇటీవల జాతీయ రహదారి పనులకు మట్టిని తీసుకు వెళుతున్న ఓ టిప్పర్ టైరు పేలి భయానక వాతావరణం సృష్టించింది.

కేశవపట్నం నడిబొడ్డున తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఓ గ్రానైట్ లారీ అధిక వేగంతో వస్తూ రహదారి కోసం తీసి పూడ్చిన ఓ గుంతలో దిగబడి దానిపై ఉన్న బండరాయి వాణిజ్య సముదాయానికి కొద్ది దూరంలో పడిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. రహదారి వెంబడి వరుస ప్రమాదాలు జరుగుతున్న రవాణా శాఖ అధికారులు కానీ ఇతర సంబంధిత శాఖ అధికారులు కానీ వాటిపై చర్య తీసుకున్నట్టు దాఖలాలు లేకుండా పోయాయి. ఓవర్ లోడ్, అధిక స్పీడ్ జనావాసాల మధ్య నుండి దూసుకుపోతున్న లారీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. అనుభవం లేని డ్రైవర్లు వాటిని నియంత్రించలేకపోతున్నారనే సందేహం ప్రజల్లో నెలకొంది. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed