- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళితులకు బీఆర్ఎస్ ఏం చేసిందో గల్లా ఎగరేసి చెప్తాం: ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
దిశ, జగిత్యాల ప్రతినిధి : రాష్ట్రంలో దళితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో.. గల్లా ఎగరేసి చెబుతామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. దళితబంధు పథకం విషయంలో పట్టబద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రవిశంకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవి శంకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేవలం తన రాజకీయ ఉనికి కోసమే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దేశంలో మరెక్కడా లేని దళితబంధు వంటి పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పొందాలంటే దళితులు బ్యాంకర్ల చుట్టూ చెప్పులరిగగేలా తిరిగినా దక్కేవి కావని విమర్శించారు. ఢిల్లీలో కాదు కదా.. కనీసం గల్లీలో లేని కాంగ్రెస్ పార్టీ కోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేన్నారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, లైబ్రరీ చైర్మెన్ డా.చంద్రశేఖర్ గౌడ్, మల్యాల జడ్పీటీసీ రామ్మోహన్ రావు, పాక్స్ చైర్మన్ సాగర్ రావు, మల్యాల ఏఎంసీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.