విధి నిర్వహణలో అలసత్వం వీడాలి : MLC Kaushik Reddy

by Shiva |   ( Updated:2023-04-28 14:35:10.0  )
విధి నిర్వహణలో అలసత్వం వీడాలి : MLC Kaushik Reddy
X

దిశ, హుజూరాబాద్ : విధి నిర్వహణలో అలసత్వం వీడాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వైద్యులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా సేవలు అందించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశానుసారం సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆస్పత్రిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఐసీయూ, డయాలసిస్ సెంటర్ లో బెడ్ల సంఖ్య పెంపు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాల్లో పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, డీఎంహెచో డాక్టర్ లలితాదేవి, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed