- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ధాన్యం కొనగోలులో అధికారుల సమన్వయ లోపం : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కొనుగోలు కేంద్రాలకు లారీల కొరత
దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలంలోని పోరండ్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ఐదారు రోజుల నుంచి లారీలు రాకపోవడంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయిందని పలువురు రైతులు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జీవన్ రెడ్డి వెంటనే జాయింట్ కలెక్టర్ తో పాటు కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అధికారుల మధ్య సమన్వయ లోపం ఉందని లారీలు వస్తున్నాయని, మరొకరు రావడం లేదని మరొకరు పొంతన లేని సమాధానం చెబుతున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం వచ్చిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని క్వింటాల్ కు 5 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఎమ్మెల్సీ ఎదుట వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలించేందుకు తక్షణమే లారీలు పంపించాలని, తూకం వేయాలని, కోతలు విధించకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికారులకు సూచించారు.