రుద్రంగిలో జాబ్ మేళా.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

by Aamani |
రుద్రంగిలో జాబ్ మేళా.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తూ కొలువుల భర్తీ చేస్తున్న రాష్ట్ర సర్కార్ వివిధ ప్రైవేటు కంపెనీల్లో కూడా వారికి ఉద్యోగ అవకాశాలు అందించే కార్యక్రమాన్ని శనివారం చేపట్టింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో పలు కంపెనీలతో జాబ్ మేళా నిర్వహించనుంది. ప్రైవేటు కంపెనీల్లో యువతకు అవకాశాలు అందించేందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జాబ్ మేళాలు చేపట్టింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచనల మేరకు రాజన్న సిరిసిల్ల ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో శనివారం రుద్రంగిలోని రెడ్డీస్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు.

1000 ఉద్యోగాలే లక్ష్యంగా..!

ఈ జాబ్ మేళాలో పలు ప్రైవేటు కంపెనీలు 1000 ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ, కన్స్ స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, మార్కెటింగ్, ఆటో మొబైల్స్, సేల్స్, మేనేజ్మెంట్, సెక్యూరిటీ, ఎంఎన్ సీ లకు చెందిన కంపెనీలు, కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ ఇతర ప్రాంతాలకు చెందినవి కూడా పాల్గొంటున్నాయి. ఇందులో అపోలో ఫార్మసీ, అనుభ సాఫ్ట్, వరుణ్ మోటార్స్, రానే బ్రేక్ లైనర్స్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, ఐటీసి ఫుడ్స్ తదితర సంస్థలు మేళాకు హాజరు కానున్నాయి.

Advertisement

Next Story