జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థి

by Sridhar Babu |
జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థి
X

దిశ, సుల్తానాబాద్ : జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఐపీఎస్ పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో నిర్వహించే జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలకు చెందిన విద్యార్థి ఎం. సంప్రీత్ ను డీఈఓ మాధవి అభినందించారు.

ఈ సందర్భంగా డీఈఓ మాధవి జాతీయ క్రీడాకారున్ని అభినందిస్తూ పెద్దపల్లి జిల్లా నుంచి జాతీయస్థాయిలో పాల్గొనడానికి వెళ్తున్న క్రీడాకారుడు మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎంఈఓ రాజయ్య, పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపాల్ కృష్ణప్రియ మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడం అజయ్ విద్యార్థి సంప్రీత్ ను, కోచ్ సత్యనారాయణను అభినందించారు.


Next Story

Most Viewed