- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం.. భారీ నగదుతో పాటు రెండు లక్షల మేర ఆస్తి నష్టం
దిశ, హుస్నాబాద్: షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమై అపార ఆస్తి నష్టం సంభవించిన ఘటన హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ... కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. అక్కన్నపేట మండలం పంతులు తండా గ్రామపంచాయతీ పరిధిలోని తారాచంద్ తండాలో శనివారం రాత్రి బట్టు రాజు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగి వ్యాపించాయి. వెంటనే తేరుకున్న కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరిగెత్తుకుంటూ వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే దట్టంగా మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న బట్టలు, బియ్యం, వంట సామాగ్రి, మంచాలు, విలువైన వస్తువులు, అగ్నికి ఆహుతయ్యాయి. మరీ ముఖ్యంగా పిల్లల చదువు కోసం మరియు అప్పు తీర్చడానికి అని తెచ్చుకున్న రెండు లక్షల రూపాయలలో కొన్ని 500 నోట్లు పూర్తిగా దగ్ధమవ్వగా.. మరికొన్ని సగం కాలిపోయాయి. సర్వం కోల్పోయిన కూలి పని చేసుకుని జీవనం సాగించే బట్టు రాజు తన యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.