రైతుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది: టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

by Shiva |   ( Updated:2023-03-06 10:05:54.0  )
రైతుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది: టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
X

దిశ, కొడిమ్యాల: హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా కొడిమ్యాల మండలానికి చేరుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోతారం రిజర్వాయర్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు ఆయనకు తమ సమస్యలు విన్నవించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవరిస్తుందని ఆరోపించారు. పోతారం చెరువు బ్యాక్ వాటర్ వల్ల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వానాకాలం ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని, వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

మత్తడి నిర్మాణం పూర్తి కాలేదని బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం సరికాదన్నారు. అర్అండ్అర్ ప్యాకేజీ కింద కొనాపుర్ గ్రామానికి చెందిన 135 కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్ ఇక్కడి ప్రజల సమస్యలు ఎందుకు తీర్చడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, మెడిపేల్లి సత్యం, నాగి శేఖర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story