- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసిన భూ బకాసురులు
దిశ, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపెళ్లి ధర్మారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 431 లో గల (6-30) ఆరు ఎకరాల 30 గుంటలు భూమి ఉంది. ఇందులో నుండి కొంత భాగం కొత్తపల్లి స్మశాన వాటికకు కేటాయించగా మరికొంత భాగం నిరుపేదలైన బీడీ కార్మికులకు, మసీదు నిర్మాణానికి అలాగే కొంతమంది నిరుపేదలకు ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వగా.. మిగతా ప్రభుత్వ భూమి కొందరు భూ బకాసురులు కబ్జా చేసుకొని ఆక్రమించారు.
మరికొందరు ఈ ప్రభుత్వ భూమిని చూపించి సర్వే నెంబర్ మార్చి అక్రమంగా తన పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారు. సర్వేనెంబర్ 431 గల ప్రభుత్వ భూమిని జిల్లా సర్వేయర్ సర్వే చేయించి అట్టి భూమికి హద్దులు పెట్టి భూకబ్జాదారుల నుండి అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవాలని, అలాగే నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇప్పించగలరని ప్రభుత్వాన్ని స్థానికులు కోరుతున్నారు.