Gaddar Varthanti : ప్రజాస్వామ్య పరిరక్షణే గద్దర్ ఆశయం

by Sridhar Babu |
Gaddar Varthanti : ప్రజాస్వామ్య పరిరక్షణే గద్దర్ ఆశయం
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : దేశ రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆశయమని, పాట ఉన్నంతవరకు గద్దర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని, ఆయన ఆశయ సాధనకు మన అందరం కృషి చేయాలని గద్దర్ కూతురు వెన్నెల, అరుణోదయ సాంస్కృతిక సమితి అధ్యక్షురాలు విమలక్క, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ప్రొఫెసర్ కాశీం లు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వాసవి ఫంక్షన్ హాల్ లో ప్రజాసంఘాల నాయకుడు రాగుల రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రథమ వర్ధంతి సభలో ముఖ్య అతిథులుగా వారు హాజరైయ్యారు. కార్యక్రమానికి ముందు గద్దర్ కూతురు వెన్నెల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రథమ వర్ధంతి సభలో వారు

మాట్లాడుతూ ప్రజాయుద్ధ నౌక గద్దర్ అంటే ఉద్యమ గళం అని, పాట ఉన్నంతవరకు ఆయన ప్రజల గుండెల్లో గుర్తుంటారన్నారు. గద్దర్ తన ఆట పాటల ద్వారా ప్రజలను చైతన్యం వంతం చేశారని, సమస్య ఎక్కడుంటే అక్కడ వాలిపోయి గళం విప్పేవారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేశారన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని, ప్రజానాట్య మండలిని స్థాపించి కాలికి గజ్జె కట్టి, ఆటపాటల ద్వారా ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నారని తెలిపారు.

గద్దర్ ను మించిన కళాకారుడు లేరని, అటువంటి గద్దర్ ప్రథమ వర్ధంతి సభ సిరిసిల్లలో జరుపుకోవడం అభినందనీయమన్నారు. గద్దర్ ను గత ప్రభుత్వం అవమానపరిచిందని, ప్రస్తుత ప్రభుత్వం గద్దర్ పేరిట నంది అవార్డుల ప్రదానం చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ లో ఏర్పాటు చేసి, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో పొందుపరచాలన్నారు. గద్దర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, కార్మిక సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed