పరిశ్రమల పరిధిలోని గ్రామాల్లో వసతులు కల్పించాలి

by Sridhar Babu |
పరిశ్రమల పరిధిలోని గ్రామాల్లో వసతులు కల్పించాలి
X

దిశ,పెద్దపల్లి : పరిశ్రమల పరిధిలో గల గ్రామాలు, మున్సిపల్ ఏరియాలలో కనీస వసతుల కల్పన బాధ్యతగా స్వీకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు. కలెక్టరేట్ పరిధిలో ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్.ఎఫ్.సీ.ఎల్, కేశోరాం సిమెంట్ ప్రతినిధులతో కన్వర్జేన్స్ సమావేశం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ తో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్టీపీసీ, సింగరేణి , కేశోరం సిమెంట్, ఆర్.ఎఫ్.సీ.ఎల్ పరిశ్రమల పరిధిలో ఉన్న గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగు నీటి సరఫరా, స్ట్రీట్ లైట్స్ మొదలైన అంశాల బాధ్యతను సదరు పరిశ్రమలు చేపట్టాల్సి ఉంటుందని కలెక్టర్ ఆదేశించారు. రామగిరి మండలం సెంటినరీ కాలనీలో తాగు నీటి సరఫరా పనులకు ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed