30 మంది బాలకార్మికులకు విముక్తి

by Sridhar Babu |
30 మంది బాలకార్మికులకు విముక్తి
X

దిశ, జగిత్యాల టౌన్ : జిల్లాలో తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్-క్సీ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా జనవరి నెలలో 30 మంది బాలకార్మికులను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచామన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నా, తప్పిపోయిన బాలల సమాచారం తెలిసినా డయల్ 100 కి కాల్ చేయాలని కోరారు. బాలకార్మికులుగా పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


Next Story

Most Viewed