- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా..! కాంగ్రెస్‌కు బండి సంజయ్ సవాల్
దిశ, కరీంనగర్ బ్యూరో: సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా..? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కరీంనగర్‌లోని ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణిపై సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకాలతో పాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందని అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన తరువాత కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం అసాధ్యమని అన్నారు. ప్రజలను అయోమయం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. మోదీ రామగుండం వచ్చి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. సింగరేణిలో కేంద్రానిది 49 శాతం వాటా మాత్రమేనని రాష్ట్రానిది 51 శాతం ఉందని అన్నారు. అలాంటప్పుుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా సింగరేణి ప్రైవేటీకరించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వమే కారణమని అన్నారు.
తాడిచర్లను ఏపీ జెన్‌కోకు ఇస్తే.. కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు అప్పగించింది నిజం కాదా అని అన్నారు. సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించిందే కేసీఆరేనని, ఆయన మూర్ఖపు ఆలోచన వల్లే సంస్థను పూర్తిగా దెబ్బతీశారని ఆరోపించారు. సింగరేణిని తన కుటుంబానికి ఏటీఎంగా మార్చుకున్నారని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే.. కార్మికుల పట్ల ప్రేమే ఉంటే గతంలో కేసీఆర్ చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ము మీకుందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ స్వలాభం కోసం సింగరేణిలో అంతులేని అవినీతి చేస్తే... కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ గతంలో నయీం కేసు, మియాపూర్ భూములు, డ్రగ్స్, పేపర్ లీకేజీ వంటి వాటిపై సిట్ వేసి మధ్యలోనే నీరుగార్చారని అన్నారు.
కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకుంటున్నారే తప్పా వారికి వేరే ఆలోచన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం కేంద్రానికి సాధ్యమే కాదు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ కృషి వల్లే ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. 2014లో ఐక్యరాజ్య సమితిలో మోడీ మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించడం వల్లే గత పదేళ్లుగా జూన్21 రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు.