District SP Akhil Mahajan : అప్రమత్తత ఒక్కటే శ్రీరామరక్ష..

by Sumithra |
District SP Akhil Mahajan : అప్రమత్తత ఒక్కటే శ్రీరామరక్ష..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సైబర్ మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తత ఒక్కటే సైబర్ నేరాలకు శ్రీరామరక్ష జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఆన్ - లైన్, మల్టీ లెవల్ మార్కెటింగ్, చైన్ (గొలుసుకట్టు) మార్కెటింగ్ ల పేరుతో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు అంటూ చేస్తున్న మోసపూరిత ప్రచారాల పట్ల జిల్లాప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈజీ మనీ ఆశలో పడి మోసపోవద్దన్నారు.

పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటు, కొన్ని గంటల్లో రెట్టింపు నగదు ఇస్తామంటూ, బహమతులు ఇస్తామంటూ ఆశావహులకు సైబర్ మోసగాళ్లు ఎరవేసి కుచ్చుటోపీ పెడుతున్నారని, వాటి పట్ల అప్రమత్తత ఒక్కటే అత్యుత్తమ మార్గం తెలిపారు. జిల్లాలో Wwake, Tranzindia, DAAI, THIRDIEYE AI, Discovery prestige.com అనే ఆన్లైన్ యాప్ ల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడ్డారని, జిల్లా పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు జిల్లా ఎస్పీ ప్రకటనలో పేర్కొన్నారు.



Next Story

Most Viewed