- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్...గంభీర్పూర్ సొసైటీలో భూసేకరణకై చేసిన తీర్మానం రద్దు

దిశ, కథలాపూర్ : ఇటీవల దిశలో ప్రచురితమైన వార్తకు జిల్లా స్థాయి అధికారులు స్పందించారు. గంభీర్పూర్ సొసైటీ లో జరుగుతున్న అవకతవకలు, పెట్రోల్ బంక్ ఏర్పాటుకు భూ సేకరణ విషయంలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాల్సిందిగా రైతులు పట్టుబట్టారు. ఈ క్రమంలో అవినీతిపై దిశ లో పూర్తి వివరాల కథనాన్ని ప్రచురించింది. రూ.7.5 లక్షలకు కొనాల్సిన భూమిని రూ.42 లక్షల మేరకు వెచ్చించాల్సిన అవసరం ఏముందని దిశ ప్రచురించింది. మరో వైపు దీనికి గ్రామ వీడీసీ సభ్యులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తీర్మానాన్ని రద్దు చేయాల్సిందిగా పట్టుబట్టి ఇదివరకే నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించిన అధికారులు తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే గతంలో దీనికి మద్దతు తెల్పిన ఒక డైరెక్టర్, చైర్మన్ గైర్హాజరు అయ్యారు. ప్రధానంగా సర్వసభ్య సమావేశానికి చైర్మన్ హాజరవ్వాల్సి ఉండగా గైర్హాజరు అవ్వడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రధానంగా పెట్రోల్ బంక్ కు సంబంధించి 8 మంది డైరెక్టర్లు సంతకం చేయగా అందులో ముగ్గురు మాత్రం ఈ తీర్మానం పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా చైర్మన్ దాసరి గంగాధర్ తెలివిగా మొదట త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి అందులో అధ్యక్షులుగా తాను కొనసాగుతూ వైస్ చైర్మన్ గా ఉన్న శీలం మోహన్ రెడ్డి తో పాటు డైరెక్టర్ గా ఉన్న కోన్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి కి త్రిసభ్య కమిటీ లో చోటు కల్పించాడు. అలాగే కన్వీనర్ గా సురకంటి విజయను చేర్చాడు. పెట్రోల్ బంక్ నిమిత్తం కొనుగోలు చేసిన భూమిని సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చెయ్యక ముందే చైర్మన్ దాసరి గంగాధర్ డబ్బులు డ్రా చేశారు.
కాగా 15 గుంటల భూమికి గాను మొత్తం 42 లక్షల్లో 32 లక్షలను డ్రా చేశాడు. ఇదే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీంతో సొసైటీ పరిధి గ్రామాల్లోని రైతుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణం అయింది. ఇక ఒక్క క్షణం కూడా చైర్మన్ పదవిలో కొనసాగడానికి అనర్హుడు అంటూ వీడీసీ సభ్యులు, రైతులు భీస్మించుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈనెల 14తో చైర్మన్ పదవీ కాలం ముగుస్తుంది. అయినప్పటికీ రైతులు అవిశ్వాసం పెట్టాల్సిందే అంటూ పట్టుబట్టారు. అయితే చైర్మన్ గైర్హాజరు అవ్వడంతో అవిశ్వాసం ఎలా అనే సమస్య ఏర్పడింది. కాగా శనివారం రోజున నిర్వహించిన సర్వ సభ్య సమావేశానికి హాజరైన రైతులు డైరెక్టర్లను డీసీఓతో మాట్లాడించి చైర్మన్ పై అవిశ్వాసానికి జగిత్యాల తరలి వెళ్లారు.
కొసమెరుపు ఏంటంటే...
అయితే పెట్రోల్ పంప్ కు సంబంధించిన విధి విధానాల పట్ల చర్చను గత సంవత్సరం 2024 సెప్టెంబర్ 26 వ తేదీన జరిగింది. అప్పుడే చైర్మన్ చాకచక్యంగా తనకు ఊరి చివరన 113 ఉ/1 సర్వే లో వ్యవసాయ భూమి ఉన్నదని, ఆ భూమిని గుంటకు 2,80,000 లకు విక్రయించడానికి సమ్మతిని పొంది ఆ తీర్మానం పై డైరెక్టర్ల తో సంతకాలు తీసుకోవడం కొస మెరుపు.