Ramagundam CP : డయల్ 100, 112 కాల్ వచ్చిన వెంటనే స్పందించాలి..

by Sumithra |
Ramagundam CP : డయల్ 100, 112 కాల్ వచ్చిన వెంటనే స్పందించాలి..
X

దిశ, గోదావరిఖని : రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఐపీఎస్, (ఐజీ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల పరిధిలోని డీసీపీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐలు బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బందితో డయల్ 100, 112 కాల్స్ పై స్పందన వారి పనితీరు శనివారం నాడు జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి ప్రజల సమస్యలను చట్టపరిధిలో తీర్చాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, ప్రో ఆక్టివ్ పోలీసింగ్ ఉండాలి.

బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్, రద్దీ ప్రాంతాల్లో, విజిబుల్ పోలీసింగ్ పెట్రోలింగ్ నిర్వహించాలి. సమస్యాత్మక, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాలను ఎస్హెచ్ఓ లు సందర్శించాలి. శాంతి భద్రతల పరిరక్షణ, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో డయల్ 100, 112 టోల్ ఫ్రీ ద్వారా వచ్చిన కాల్స్ పై సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది పై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా సత్వర స్పందన, అత్యున్నత ప్రమాణాలను పాటించాలని సూచించారు. డయల్ 100, 112 హెల్ప్ లైన్ ద్వారా వచ్చిన కాల్స్ పై సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల పై ఉంది అని ఆపదలో ఉన్న బాధితులు పోలీసుల సహాయం కోసం డయల్ 100 కి ఫోన్ చేస్తారని ప్రతి పోలీసులు గుర్తించాలి.

డయల్ 100, 112 వచ్చే ఫోన్ కాల్ విషయంలో ఎస్ఐ, సీఐ ఏసీపీ ల పర్యవేక్షించాలన్నారు . డయల్ 100 కాల్స్ పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని బాధితులకు అందించిన సహాయాలను సైతం రికార్డు చేశారన్నారు. సిబ్బందికి రివార్డ్ లు ఇస్తారన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు ప్రధాన పాత్ర పోషిస్తూ, సిబ్బందితో కలిసి పట్టణంలో, గ్రామాల్లో డయల్ 100, 112 ల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డయల్ 100 కి కాల్ చేస్తే తాము సురక్షితంగా ఉన్నట్లు అనే భావన ప్రజల్లో మరింత పెంపొందించాలన్నారు. పోలీస్ శాఖ పై ప్రజలకున్న విశ్వాసాన్ని మరింత పెంచుతూ ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు.

డయల్ 100 కాల్ వచ్చిన తర్వాత పోలీసులు బాధితులను చేరుకునే రెస్పాన్స్ సమయాన్ని తగ్గించాలని, తొందరగా సంఘటనా స్థలాన్ని చేరుకుంటే పోలీసుల పై ప్రజల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జూమ్ మీటింగ్ లో పెద్దపల్లి డీసీపీ చేత ఐపీఎస్, పెద్దపల్లి డీసీపీ భాస్కర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, కమిషనరేట్ పరిధిలోని ఏసీపీ, సీఐ, ఎస్ఐలు బ్లూకోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది, ఇన్స్పెక్టర్ సీసీ అర్బీ బుద్దె స్వామి, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, పీసీఆర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఆర్ఐలు దామోదర్, మధులు, ఎస్ఐలు, పాల్గొన్నారు.

Advertisement

Next Story