- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీఐ పార్టీకి పూర్వ వైభవం తేవాలి : చాడ
దిశ, చిగురుమామిడి : భారత కమ్యూనిస్టు పార్టీకి మండలంలో పూర్వ వైభవం తెచ్చే విధంగా కార్యకర్తలు అందరూ కృషి చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య యాత్ర గురువారం చిగురుమామిడికి చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులేనని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కన్నతల్లి లాంటి సీపీఐ పార్టీని ప్రజలు మరువవద్దన్నారు.
అనంతరం ఇందుర్తి గ్రామంలో లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, జగిత్యాల జిల్లా కార్యదర్శి వెన్నం సురేష్, పెద్దపెల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మందపవన్, సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు, రాష్ట్ర నాయకులు అందే స్వామి, చిగురుమామిడి మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, నాయకులు చాడ శ్రీధర్ రెడ్డి, మణికంఠ రెడ్డి, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.