- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్
దిశ, గంభీరావుపేట : బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ కూడా నడుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో రూ.23 కోట్ల కేంద్ర నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు నిర్మించిన రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు. గంభీరావుపేట నుండి మల్లారెడ్డిపేటకు వెళ్లే దారిలో రూ.8.30 కోట్ల కేంద్ర నిధులతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. గతంలో గంభీరావుపేట ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు రూ.15 కోట్ల వ్యయంతో రోడ్డును నిర్మించామని, అలాగే గంభీరావు పేట నుండి మల్లారెడ్డిపేట వరకు రూ.8.30 కోట్ల వ్యయంతో నూతనంగా బ్రిడ్జిని నిర్మించినట్టు తెలిపారు.
వాటిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలోనూ కేంద్ర ప్రభుత్వం సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో నిధులిచ్చిందని గుర్తు చేశారు. వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం తమ సొమ్ముగా ప్రచారం చేసుకుందని ఆరోపించారు. రాజకీయ వైషమ్యాలతో గత ప్రభుత్వం కుట్రలు చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తోవలో నడుస్తుందని చెప్పారు. మితిమీరిన విమర్శలు చేసి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు. తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం ఖర్చు పెట్టడం ఏ మాత్రం మంచి పద్దతి కాదన్నారు. గతంలో కేసీఆర్ తెలంగాణ డబ్బును పంజాబ్, కర్నాటక రాష్ట్రాల్లో ఖర్చు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తెలంగాణ సొమ్మును మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు చేసిందన్నారు.
ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొండి చేయి చూపడంతో మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను ఓడించి బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ మెజారిటీ సీట్లు సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంట అశోక్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, రెడ్డబోయిన గోపి, మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ యాదవ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు విగ్నేష్, నాయకులు శ్రావణ్ యాదవ్, కృష్ణ కాంత్, దేవసాని కృష్ణ, పత్తి స్వామి, బోయ లక్ష్మణ్, ఆంజనేయులు, దేవేందర్ పాల్గొన్నారు.