గంగపుత్రుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

by Sridhar Babu |
గంగపుత్రుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
X

దిశ, జగిత్యాల టౌన్ : గంగపుత్రుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకా రులకు 100 శాతం సబ్సిడీతో అందిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. పట్టణ పరిధిలోని కండ్లపల్లి చెరువులో లక్ష 35వేల చేప పిల్లలను వదిలారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను అమలు చేస్తూనే కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,ఎంపీడీఓ రమాదేవి, గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుమ్ముల అంజయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed