Collector Sathyaprasad : లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణమాఫీ పూర్తి

by Sridhar Babu |
Collector Sathyaprasad : లక్షన్నర వరకు ఉన్న రైతుల రుణమాఫీ పూర్తి
X

దిశ, జగిత్యాల టౌన్ : జిల్లాలో 169 కోట్ల రుణమాఫీ కానున్నాయని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని, నేడు లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీ నుంచి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత కింద లక్ష రూపాయల

వరకు రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, నేడు లక్షన్నర వరకు ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు జిల్లాలో రెండో విడత కింద 19,623 మంది రైతులకు గాను 169 కోట్ల రూపాయల రుణమాఫీ కానున్నాయని కలెక్టర్ తెలిపారు. రుణమాఫీ సొమ్ము నేరుగా రైతుల ఖాతాలోని జమ చేయడం జరుగుతుందని, దీనికోసం బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాణి, రఘువరన్, ఎల్ డీఎం రామ్ కుమార్, వివిధ శాఖల బ్యాంకు మేనేజర్లు, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story