అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే కోరుకంటి చందర్

by Shiva |   ( Updated:2023-08-29 10:10:13.0  )
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ : ఎమ్మెల్యే కోరుకంటి చందర్
X

దిశ, గోదావరి ఖని : అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎకైక సీఎం కేసీఆర్‌ అని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం మార్కండేయ కాలనీలోని రాజ్యలక్ష్మి గార్డెన్స్ లో పాలకుర్తి మండలం తక్కళ్లపల్లి బసంత్ నగర్ కు చెందిన 100 మంది ముస్లిం మహిళలు మరో 100 మంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే చందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆడపిల్లలో పెళ్లి కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను ప్రవేశ పెట్టామని తెలిపారు ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకునేందుకు గాను మైనారిటీ గరుకుల పాఠశాలను ఎర్పాటు చేసిందని తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను ప్రభుత్వం అందజేస్తందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు దృష్టిలో ఉంచుకుని మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసకురావాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ‌

కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుందని, వారికి ఓటు వేస్తే మళ్లీ అదోగతి తప్పదని అన్నారు. విజయమ్మ పౌండేషన్ ద్వారా రామగుండం నియోజకవర్గంలో నాలుగేళ్లుగా ప్రతి డివిజన్ లోని ప్రతి గ్రామంలో మహిళ సాధికారత కేంద్రాలు ఎర్పాటు చేశామని, ఉచితంగా కుట్టులో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఇంజపురి నవీన్, తంగెడ అనీల్ రావు, సర్వర్ ముస్తఫా, మహేందర్, ఫయాజ్ అతిక్, రమేష్ శనాథ్, కార్పొరేటర్ దాతు శ్రీనివాస్, కలువల సంజీవ్, కోల సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story