చిక్కాల రామారావు సంచలన వాఖ్యలు..!

by Javid Pasha |   ( Updated:2022-12-18 11:56:47.0  )
చిక్కాల రామారావు సంచలన వాఖ్యలు..!
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల సెస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ బలపరుస్తున్న తంగళ్లపల్లి మండల సెస్ డైరెక్టర్ అభ్యర్థి చిక్కాల రామారావ్ ఆదివారం తంగళ్లపల్లి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో సంచలన వాఖ్యలు చేశారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో సెస్ డైరక్టర్ అభ్యర్థి ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎన్నికల ఇన్చార్జీ చీటీ నర్సింగరావ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యతో పాటు పలువురు ముఖ్య నేతలు హజరయ్యారు. సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావ్ గతంలో లాగా దూకుడుగా కాకుండా చాలా కూల్ గా మాట్లాడారు. ఎన్నికల్లో గెలవడం కోసం మండల కార్యకర్తలను, నాయకులను ప్రాదేయపడుతూ ఉపాన్యాసం చేశారు. తాను గతంలో ఉమ్మడి సిరిసిల్ల మండల సెస్ డైరక్టర్ గా.. సెస్ చైర్మన్ గా పని చేశానని.. ఏమైన పొరపాట్లు చేసి ఉంటే పెద్దమనసుతో మన్నించాలని వేడుకున్నారు. గెలిపిస్తే మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో చైర్మన్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు సిరిసిల్లా రాజకీయాలను శాసించిన చిక్కాల.. ఇవాళ సెస్ పదవి కోసం ప్రతి ఒక్కరినీ ప్రాధేయపడటం చూసి బీఆర్ఎస్ నేతల్లో పెద్ద చర్చ జరుగుతోంది. 8 ఏళ్లుగా చిక్కాలకు ఏ పదవి రాలేదు.

అయితే పార్టీ ముఖ్య నేతల అభిప్రాయం మేరకు ఈ సారి కేటీఆర్ చిక్కాలకు సెస్ డైరెక్టర్ గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే చిక్కాల రామారావు పార్టీలో ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతున్నారు. గతంలో తనతో రాజకీయంగా విబేధించిన వారిని సైతం కలుపుకుపోతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఏ మండలంలో పడని నామినేషన్లు తంగళ్లపల్లి మండలంలో చిక్కాల రామారావ్ పై మొత్తం 20 నామీనేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కొంతమంది నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. ప్రస్తుతం తంగళ్లపల్లి మండలంలో కాంగ్రెస్, బీజేపి, బీఎస్పీ బలపరిచిన అభ్యర్థులు మినహా ఎవరు లేకపోవడంతో చిక్కాల రామారావ్ కు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సెస్ చైర్మన్ గిరి చిక్కాల చెంతకు చేరనుందా...? లేదా అనేది వేచి చూడాల్సిందే.

ఫ్లాష్.. ఫ్లాష్.. టీ-కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం....MLA సీతక్క సహా ఒకేసారి 12 మంది కీలక నేతలు రాజీనామా


Next Story

Most Viewed