- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశ్నించే గొంతులను నొక్కుతున్న కేంద్రం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
దిశ, జగిత్యాల ప్రతినిధి: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో ఉంటూ ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కేందుకే వారి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక ఇందిరా భవన్లో వారు మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం కులాలు, మతాల పేరిట ప్రజలని చీల్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంటే భారత జాతిని ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని గుర్తు చేశారు.
Śయూపీఏ ప్రభుత్వం పేదలు బుక్కెడు అన్నం తినాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే బీజేపీ ప్రభుత్వం మాత్రం దేశ సంపదను అంతా అధాని కే దోచి పెడుతుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా వ్యక్తిగతంగా ఎలా కక్ష్య గడుతోందని అనేందుకు రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దే అందుకు నిదర్శనం అని అన్నారు. ఇది భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను రద్దు చేయడం ఈ రోజు దేశానికే చీకటి రోజు అని విమర్శించారు.ఈ సంధర్బంగా రాహుల్ గాంధీకి యావత్ భారతదేశం అండగా నిలబడుతుంది అని పేర్కొన్నారు.