- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతుల సమస్యలు పరిష్కరించకుండానే సంబరాల : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రైతుల సమస్యలు పరిష్కరించకుండానే సంబరాల : ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి
రాష్ట్రంలో రైతులు ప్రశ్నిస్తారనే భయంతో బైండోవర్
మేనిపెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పంట రుణమాఫీ చేయాలి
దిశ, రాయికల్ : రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండానే దశాబ్ధి ఉత్సవాల సంబరాల అంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం రాయికల్ మండలంలోని పాత్రికేయుల సమావేశంలో అయన మాట్లాడుతూ.. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లోని రైతులను తూకం, ధాన్యం సేకరణ , రవాణా, ఆన్లోడింగ్ సమస్యలు వేధిస్తూనే ఉన్నాయని తెలిపారు. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సేకరించి, మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సేకరించి, మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోవడంతో ఉత్సవాల్లో రైతులు ప్రశ్నిస్తారనే భయంతోనే బైండోవర్ చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం సేకరణలో సంచికి 4 కిలోల చొప్పున క్వింటాలుకు 10 కిలోలు కోత విధించడం సరి కాదన్నారు.
శుద్ధి చేసిన తర్వాత అధికారులు ధ్రువీకరించినా మిల్లర్లు కోత విధించడం దారుణమన్నారు. ధాన్యం రవాణాకు లారీలు రావాలంటే రైతే మిల్లర్ తో మాట్లాడి అధిక తూకానికి ఒప్పందం కుదుర్చుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రైతుల సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరించకుండా సంబురాలు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏకకాలంలో రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం నాలుగున్నర ఏళ్లు గడుస్తున్నా కేవలం రు.35,000 మాత్రమే రుణమాఫీ చేయడం లేదని విమర్శించారు.
గతంలో పంట రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ దీర్ఘకాలిక, మధ్య కాలిక రూణాలపై 6 శాతం వడ్డీ రాయితీ ఇచ్చామన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ రాయితీలను పూర్తిగా నిలిపివేసిందాని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయనంత కాలం బీఆర్ఎస్ నాయకులకు రైతాంగాన్ని ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కడ సాగు చేయడం లేదని ఉమ్మడి కరీంనగర్లో సాగు చేస్తున్న ప్రతి ఎకరం ఎస్సారెస్పీ ప్రాజెక్టుతోనేనని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలకు రు.వేయి కోట్ల ప్రకటనలు ఇచ్చారని, నిధులను సద్వినియోగం చేసి స్థానిక సంస్థలకు బకాయిలు చెల్లిస్తే ఉపశమనం లభించేదన్నారు. భారత ఆహార సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం సేకరణ కోసం చెల్లిస్తున్న హమాలీ ఛార్జీలు రు.5 ప్రభుత్వం తన ఖజానాలో జమ చేసుకుంటున్నారని తెలిపారు. హమాలీ చార్జీల నిధులను రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ గోపీ రాజిరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు రవీందర్రావు, పట్టణాధ్యక్షుడు మ్యకల రమేష్, జనరల్ సెక్రెటరీ మహేందర్ గౌడ్,ఆదిరెడ్డి, మండ రమేష్, కొయ్యడ మహిపాల్ రెడ్డి, బాపురపు నర్సయ్య, గంగారెడ్డి, గంగాధర్ మున్ను, సుధీర్, భూమయ్య నాగరాజు ఆరే శ్రీనివాస్, జిల్లా మత్స్యకార శాఖ విభాగం జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ పాల్గొన్నారు.