సిరిసిల్లలో బీఆర్ఎస్ షాక్.. బీజేపీలో చేరిన సెస్ మాజీ చైర్మన్

by Mahesh |   ( Updated:2022-12-15 07:41:56.0  )
సిరిసిల్లలో బీఆర్ఎస్ షాక్.. బీజేపీలో చేరిన సెస్ మాజీ చైర్మన్
X

దిశ, సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నియోజకవర్గంలో సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుతో గత కొన్ని సంవత్సరాలుగా మనస్పర్ధలు వచ్చి టీఆర్ఎస్‌లో అసంతృప్తితో కొనసాగుతున్నాడు. చందుర్తి సెస్ డైరెక్టర్ స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశించిన రమేష్ కు లభించకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో అల్లాడి రమేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అల్లాడి రమేష్‌కు చందుర్తి మండలంలో బలమైన నేతగా పేరుంది. దీంతో సెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాసరావు బీజేపీ అభ్యర్థి అల్లా రమేష్ నిలువనున్నాడు.

Advertisement

Next Story