సస్పెండ్ అయిన ఎస్ఐకి మద్దతుగా ధర్మపురి, కొడిమ్యాల లో బంద్

by samatah |
సస్పెండ్ అయిన ఎస్ఐకి మద్దతుగా ధర్మపురి, కొడిమ్యాల లో బంద్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల రూరల్ ఎస్సై అనిల్ సస్పెన్షన్ విషయంలో ధర్మపురి పట్టణంలో బంద్ కొనసాగుతుంది. హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఇచ్చిన పిలుపుమేరకు వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు. సస్పెండ్ చేసిన ఎస్ఐ అనిల్ ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గాని అల్లర్లు గాని జరగకుండా పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

కొడిమ్యాలలో..

జగిత్యాల రూరల్ ఎస్సైగా పనిచేసిన అనిల్ పై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని కోరుతూ హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొడిమ్యాల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ మేరకు దుకాణ దారులు ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. హిందూ వాహిని కొడిమ్యాల మండల అధ్యక్షుడు కోల అనీల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంఐఎం తొత్తుగా పని చేస్తుందని ఆ పార్టీ ఒత్తిడితోనే ఎస్ఐని సస్పెండ్ చేశారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed