వైరల్ జ్వరాల నియంత్రణకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష

by Aamani |
వైరల్ జ్వరాల నియంత్రణకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష
X

దిశ, సుల్తానాబాద్: వైరల్ జ్వరాలను నియంత్రించేందుకు ఆసుపత్రికి వచ్చే రోగులను పరిశీలించిన తర్వాత అవసరమైన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. ఆసుపత్రి పని తీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధి సమావేశాన్ని నిర్వహించుకోవాలని, ఆసుపత్రి దుకాణాలకు సంబంధించి అద్దె పెంపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. ఆసుపత్రి పనితీరుపై రివ్యూ నిర్వహించిన కలెక్టర్ ప్రతి అంశానికి సంబంధించిన రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రికి దాదాపు 400 మంది అవుట్ పేషెంట్లు రెగ్యులర్ గా వస్తున్నారని, వీరికి మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సుల్తానాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story